పెళ్లి కాలేదు.. తల్లి అయ్యింది.. స్టార్ హీరో కూతురు

webdunia.com

ప్రసిద్ధ నటుడు జితేంద్ర వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమై, సినీ మరియు టీవీ రంగాలలో తనదైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి ఏక్తా కపూర్. హిందీలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్‌లో చాలావరకు ఈమె నిర్మిస్తున్నవే. అంతేకాకుండా ఇవి ఎన్నో భారతీయ భాషలలో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఆమె బాలీవుడ్‌లో పెద్ద నిర్మాతగా కూడా పేరు సంపాదించుకున్నారు.Related image

ఆమె నిర్మాణంలో వచ్చిన పలు సినిమాలు పెద్ద హిట్‌లు నిలిచాయి. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ''ది డర్టీ పిక్చర్'' కూడా ఈమె నిర్మించినదే. ఇది వంద కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకుంది. 43 ఏళ్ల ఏక్తా పెళ్లి చేసుకోలేదు. గతంలో కరణ్ జోహార్‌తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చినా ఆమె పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయారు. ఇప్పుడు సరోగసీ విధానం ద్వారా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఏక్తా.

మరో విశేషమేంటంటే అదే కుటుంబంలో ఏక్తా సోదరుడు తుషార్ కూడా ఇప్పటికే సరోగసీ విధానం ద్వారా 2016లో లక్ష్య అనే మగపిల్లాడికి జన్మనిచ్చారు. బాలీవుడ్‌లో సింగిల్ మదర్ సంస్కృతి పెరుగుతున్న తరుణంలో ఈ వార్త వైరల్ అవుతోంది.

#1 Downloaded Personalized News App

Read in App for better experience

cancel confirm